అపొస్తలుల కార్యములు 16:1-40 TBO1970 - Bible AI

1పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.

2అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు.

3అతడు తనతో కూడ బయలుదేరి రావలెనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని ఆ ప్రదేశములోని యూదులందరికి తెలియును గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను.

4"వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి."

5కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.

6"ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ప్రుగడియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి, గాని"

7యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనీయలేదు.

8అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.

9అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.

10అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.

11"కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ యెక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి."

12"మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి."

13విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి.

14అప్పుడు లూదియ అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.

15ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసముగల దానినని మీరు ఎంచితే నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

16"మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై, సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను."

17ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలు వేసి చెప్పెను.

18ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను. గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదలి పోయెను.

19ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి.

20"అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసుకొని వచ్చి - ఈ మనుష్యులు యూదులైయుండి,"

21రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుట కైనను కూడని ఆచారములు ప్రకటించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.

22అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధి పతులును వారి వస్త్రములాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

23వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.

24అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగెంచెను.

25అయితే మధ్య రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి; ఖైదీలు వినుచుండిరి.

26అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను.

27"అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నియు తెరచి యుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను."

28అప్పుడు పౌలు-నీవు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.

29"అతడు దీపము తెమ్మని చెప్పి, లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి,"

30"వారిని వెలుపలికి తీసుకొని వచ్చి - అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?"

31"అందుకు వారు - ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షింపబడుదురని చెప్పి,"

32అతనికిని అతని ఇంట నున్న వారి కందరికిని దేవుని వాక్యము బోధించిరి.

33రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.

34మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడ ఆనందించెను.

35ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు - ఆ మనుష్యులను విడుదల చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.

36చెరసాల నాయకుడు మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలు దేరి సుఖముగా పొండని చెప్పెను. |

37"అయితే పౌలు - వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొన పోవలయునని చెప్పెను."

38"ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,"

39వారిని బతిమాలు కొని వెలుపలికి తీసుకొని పోయి - పట్టణము విడిచి పొండని వారిని వేడుకొనిరి.

40వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి.

>