కీర్తనలు 54:1-7 TBO1970 - Bible AI

1"దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము."

2"దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము."

3అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.)

4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

5నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.

6"యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను."

7ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది.

© 1970 Kitabı Mukaddes Şirketi
/div>