ప్రకటన గ్రంథము 11:1-19 TBO1970 - Bible AI

1"మరియు ఒకడు చేతి కర్ర వంటి కొల కర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టును,"

2"ఆలయమునకు వెలుపలి ఆవరణను కొలత వేయక విడిచి పెట్టుము, అది అన్యుల కియ్యబడెను. వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు."

3"నేను నా ఇద్దరు సాక్షులకు అధికారమిచ్చెదను; వారు గోనె పట్ట ధరించుకొని, వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ప్రవచింతురు."

4వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును దీప స్తంభములునై యున్నారు.

5ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్నిబయలు వెలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన యెడల ఆలాగున వాడు చంపబడవలెను.

6తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారి కిష్టమైనపుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

7"వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును."

8"వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు, ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువు కూడ సిలువ వేయబడెను."

9"మరియు ప్రజలకును, వంశములకును, ఆయా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడున్నర దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు."

10"ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సాహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు."

11అయితే ఆ మూడున్నర దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.

12"అప్పుడు -ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి."

13ఆ ఘడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరచిరి.

14రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

15ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

16అంతట దేవుని యెదుట సింహాసనాసీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి-

17"వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము."

18"జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలము నిచ్చుటకును, గొప్ప వారేమి, కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింప జేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి."

19మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

ticle>