1అటు తరువాత మహాఅధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.
2"అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను - మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయెను."
3ఏలయనగా సమస్త జనములు మోహోద్రేకముతో కూడికొనిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి.
4"మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని- నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండనట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింప కుండు నట్లును దానిని విడిచి రండి."
5దాని పాపములు ఆకాశమునంటు చున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని యున్నాడు.
6అది ఇచ్చిన ప్రకారము దాని కియ్యుడి. దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపిపెట్టుడి.
7"అది - నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి."
8అందు చేత ఒక దినముననే దాని తెగుళ్లు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్టుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చి వేయబడును.
9"దానితో వ్యభిచారము చేసి సుఖభోగములనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు,"
10"ఏడ్చుచు - అయ్యో, అయ్యో, బబులోను మహా పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క ఘడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు."
11"లోకములోని వర్తకులును, ఆ పట్టణము చూచి ఏడ్చుచు, తమ సరకులను అనగా బంగారు, వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరకులను,"
12"ప్రతి విధమైన దబ్బమ్రానును ప్రతి విధములైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము చలువరాళ్లు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగువాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు;"
13నీ ప్రాణమున కిష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను.
14"రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు."
15"ఆ పట్టణముచేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు - అయ్యో, అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని,"
16"బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింప బడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క ఘడియలోనే పాడై పోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు."
17"ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురు చేయుప్రతివాడును, ఓడవారును, సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి"
18"ఈ మహా పట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి,"
19"తమ తలల మీద దుమ్ముపోసుకొని, ఏడ్చుచు దుఃఖించుచు -- అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రము మీద ఓడలు గలవారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి, అది ఒక్క ఘడియలో పాడై పోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి."
20"పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి, ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకుప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పుతీర్చియున్నాడు."
21"తరువాత బలిష్టుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, - ఈలాగు మహా పట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును."
22నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయ మంత్రములచేత మోసపోయిరి.
23"కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారి యొక్కయు బూరలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి యే శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవని చెప్పెను."
24"మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను."