మత్తయి సువార్త 14:1-36 TBO1970 - Bible AI

1"ఆ సమయమందు, చతుర్థాధిపతియైన హేరోదు, యేసుని గూర్చిన సమాచారము విని -"

2ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను. అతడు మృతులలోనుండి లేచియున్నాడు;అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగు చున్నవని తన సేవకులతో చెప్పెను.

3"ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,"

4హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.

5అతడు యోహానును చంపగోరెను గాని జనసమూహములు ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను.

6"అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి, హేరోదును సంతోషపరచెను."

7గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

8"అప్పు డామె తన తల్లి చేత ప్రేరేపించబడినదై, బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను."

9"రాజు దుఃఖపడినను, తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును, ఇయ్య నాజ్ఞాపించి"

10బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను.

11"వాడతని తల పళ్ళెములో పెట్టితెచ్చి ఆ చిన్నదానికియ్యగా, ఆమె దానిని తన తల్లి యొద్దకు తీసికొని వచ్చెను."

12అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి.

13"యేసు ఆ సంగతి విని, దోనె ఎక్కి, అక్కడనుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి, కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి."

14"ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, వారిలో రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచెను."

15"సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి - ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు పోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్ధములు కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి."

16"యేసు - ''వారు వెళ్ళనక్కరలేదు. మీరే వారికి భోజనము పెట్టుడి'' అని వారితో చెప్పగా,"

17వారు - ''ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియును లేవు'' అని ఆయనతో చెప్పిరి.

18అందుకాయన - వాటిని నా యొద్దకు తెండని చెప్పి

19"పచ్చిక మీద కూర్చుండుడని జనుల కాజ్ఞాపించి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి."

20వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండ ఎత్తిరి.

21స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు.

22వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె ఎక్కి తన కంటె ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

23"ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా నుండెను."

24అప్పటికి ఆ దోనె ఒడ్డుకు దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను.

25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడచుచు వారియొద్దకు వచ్చెను.

26"ఆయన సముద్రము మీద నడచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి."

27వెంటనే యేసు - ''ధైర్యము తెచ్చుకొనుడి; నేనే భయపడకుడి'' అని వారితో చెప్పగా

28"పేతురు - ''ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము'' అని ఆయనను అడిగెను."

29"ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడచెను, గాని"

30"గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ''ప్రభువా, నన్ను రక్షింపుము'' అని కేకలు వేసెను."

31"వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని - అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడితివి?'' అని అతనితో చెప్పెను."

32వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణగెను.

33అంతట దోనెలో ఉన్నవారు వచ్చి - నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.

34వారద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.

35"అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టపట్లనున్న ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి"

36- వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టిన వారందరును స్వస్థపడిరి.

ticle>