1ఆయన ఆ కొండమీది నుండి దిగివచ్చినపుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
2"ఒక కుష్టురోగి వచ్చి ఆయనకు మ్రొక్కి- ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను."
3"అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి - ''నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము'' అని చెప్పగా తక్షణమే వాని కుష్టురోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు - ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ;"
4"కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుము'' అని వానితో చెప్పెను."
5ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి
6"ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను."
7"యేసు - ''నేను వచ్చి వానిని స్వస్థపరచెదను'' అని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి - ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను"
8"నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును."
9"నేను కూడ అధికారమునకు లోబడినవాడను ; నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పనిచేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను."
10"యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంటవచ్చుచున్న వారిని చూచి - ''ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."
11"అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోకమందు కూర్చుందురు గాని"
12రాజ్య సంబంధులు (రాజ్య కుమారులు) వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను'' అనెను.
13అంతట యేసు - ''ఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాక'' అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను.
14తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
15ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడచెను. అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.
16సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి.
17ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన - ''నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను'' (యెషయా 53:4) అని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను.
18యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
19"అంతట ఒక శాస్త్రి వచ్చి - బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను."
20అందుకు యేసు - ''నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు'' అని అతనితో చెప్పెను.
21"శిష్యులలో మరియొకడు - ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా,"
22యేసు అతని చూచి- ''నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము'' అని చెప్పెను.
23ఆయన దోనె ఎక్కినపుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి.
24"అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా,"
25"వారు ఆయన యొద్దకు వచ్చి - ''ప్రభువా, నశించుపోవుచున్నాము; మమ్మును రక్షించుము'' అని చెప్పి ఆయనను లేపిరి."
26"అందుకాయన - ''అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు'' అని వారితో చెప్పి లేచి, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను."
27ఆ మనుష్యులు ఆశ్చర్యపడి - ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
28"ఆయన అద్దరి నున్న గదరేనీయుల దేశము చేరగానే దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలోనుండి, బయలు దేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను."
29"వారు - దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసిరి."
30వారికి దూరమున గొప్ప పందులమంద మేయుచుండగా
31ఆ దయ్యములు నీవు మమ్ములను వెళ్ళగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
32"ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి, ఆ పందులలోనికి పోయెను; ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను."
33"వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి, జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి."
34ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.