మార్కు సువార్త 14:1-72 TBO1970 - Bible AI

1"రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించు కొనుచుండిరి గాని,"

2ప్రజలలో అల్లరి కలుగునేమోయని పండగలో వద్దని చెప్పుకొనిరి.

3ఆయన బేతనియలో కుష్టురోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి యున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగుల గొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను.

4అయితే కొందరు కోపపడి - ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల ?

5ఈ అత్తరు మున్నూరు దేనారములకంటె ఎక్కువ వెల కమ్మి బీదల కియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగు కొనిరి.

6అందుకు యేసు ఇట్లనెను - ''ఈమె జోలికి పోకుడి; ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచి కార్యము చేసెను.

7"బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, నీ కిష్టమైప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను."

8"ఈమె తన శక్తి కొలది చేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను."

9సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

10"పన్నెండు మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా,"

11వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.

12"పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు - నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,"

13ఆయన- ''మీరు పట్టణములోనికి వెళ్ళుడి; అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న యొక మనుష్యుడు మీ కెదురుపడును.

14వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి - నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగు చున్నాడని చెప్పుడి.

15అతడు సామగ్రితో సిద్ధపరచిన గొప్ప మేడ గది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడి'' అని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.

16శిష్యులు వెళ్ళి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.

17సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడ వచ్చెను.

18"వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, యేసు- ''మీలో ఒకడు అనగా నాతో భుజించు చున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అని వారితో చెప్పగా,"

19వారు దుఃఖపడి నేనాయని ఒకని తరువాత నొకడు ఆయన నడుగ సాగిరి;

20"అందుకాయన ''పన్నెండు మందిలో నొకడే, అనగా నాతో కూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే,"

21నిజముగా మనుష్యకుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు'' అనెను.

22వారు భోజనము చేయుచుండగా ఆయన యొక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి ''మీరు తీసుకొనుడి; ఇది నా శరరీము'' అనెను.

23పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.

24"అప్పుడాయన- ''ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింప బడుచున్న నా రక్తము,"

25నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను;

26అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.

27"అప్పుడు యేసు వారిని చూచి ''మీరందరు అభ్యంతర పడెదరు, గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా."

28"అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్ళెదను'' అని చెప్పగా,"

29"అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా,"

30యేసు అతనిని చూచి- ''నేటి రాత్రి కోడి రెండు మారులు కూయక మునుపే నీవు నన్ను యెరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

31"అతడు మరి ఖండితముగా - నేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను, అట్లు వారందరును అనిరి."

32"వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన - ''నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడి'' అని తన శిష్యులతో చెప్పి,"

33"పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకునుచింతాక్రాంతుడగుటకును ఆరంభించెను"

34"అప్పుడాయన ''నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి యున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడి'' అని వారితో చెప్పి,"

35"కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ ఘడియ తన యొద్ద నుండి తొలగింపవలెనని ప్రార్థించుచు-"

36"''నాయనా, తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము గాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము'' అనెను."

37"మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి ''సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయై నను మేలుకొని యుండలేవా ?"

38"మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము'' అని పేతురుతో చెప్పి,"

39తిరిగి పోయి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచు ప్రార్థించెను.

40"ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు చుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమీయవలెనో వారికి తోచలేదు."

41"ఆయన మూడవసారి వచ్చి - ''మీరిక నిద్ర పోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది- ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు."

42"లెండి, వెళ్ళుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడు'' అని చెప్పెను."

43వెంటనే ఆయన ఇంకను మాటలాడు చుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడ బహు జనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండియు శాస్త్రుల యొద్ద నుండియు పెద్దల యొద్ద నుండియు వచ్చిరి.

44"ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే (యేసు), ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను"

45"వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి - బోధకుడా, అని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకొనగా,"

46వారు ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి.

47దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.

48అందుకు యేసు- ''మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా ?

49"నేను ప్రతి దినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు ఈలాగు జరుగుచున్నది'' అని చెప్పెను."

50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.

51తన దిగంబరు శరీరము మీద నారబట్టవేసుకొనియున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి.

52అతడు నారబట్ట విడచి దిగంబరుడై పారిపోయెను.

53వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితో కూడ వచ్చిరి.

54"పేతురు ప్రధాన యాజకుని యింటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి, బంట్రౌతులతో కూడ కూర్చుండి, మంట యొద్ద చలి కాచుకొనుచుండెను."

55ప్రధాన యాజకులును మహాసభ వారందరును యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి గాని ఏమియు వారికి దొరకలేదు

56అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిననను వారి సాక్ష్యములు ఒక దాని కొకటి సరిపడలేదు.

57"అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో చేతిపని కాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని"

58వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యమును చెప్పిరి గాని

59ఆలాగైనను వీరి సాక్ష్యము సరిపడ లేదు

60ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి - ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమిటని యేసు నడిగెను.

61"అయితే ఆయన ఉత్తర మేమియు చెప్పక ఊరకుండెను, తిరిగి ప్రధాన యాజకుడు - పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయనను అడుగగా,"

62"యేసు అవును నేనే; మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను."

63ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని - మనకు ఇక సాక్ష్యులతో పనియేమి ?

64"ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరు - మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి."

65"కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి."

66పేతురు ముంగిట క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పని కత్తెలలో నొకతె వచ్చి-

67పేతురు చలికాచుకొను చుండుట చూచెను; అతనిని నిదానించి చూచి - నీవును నజరేయుడగు ఆ యేసుతో నుండిన వాడవు కావా? అనెను.

68"అందుకతడు - ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పునది నాకు బోధపడ లేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను, అంతట కోడి కూసెను."

69ఆ పనికత్తె అతనిని చూచి - వీడు వారిలో ఒకని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్ప సాగెను.

70అతడు మరల నేను కాననెను. కొంత సేపయిన తరువాత దగ్గర నిలిచి యున్నవారు మరల పేతురును చూచి - నిజముగా నీవు వారిలో ఒకవు; నీవు గలిలయుడవు గదా యనిరి.

71"అందుకతడు- మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకు ఒట్టుపెట్టు కొనుటకును మొదలు పెట్టెను."

72"వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక, - కోడి రెండు మారులు కూయక మునుపు నీవు నన్ను యెరుగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను."

ticle>