యాకోబు 4:1-17 TBO1970 - Bible AI

1మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా?

2"మీరాశించుచున్నారు గాని మీకు దొరకుట లేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని, సంపాదించు కొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని, దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు."

3మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుట లేదు.

4"వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును."

5ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

6"కాదు గాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత - దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది."

7"కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును."

8"దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీహృదయములను పరిశుద్ధపరచుకొనుడి."

9"వ్యాకులపడుడి దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునుకును, మీ అనందము మార్చుకొనుడి."

10"ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును."

11"సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి."

12ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు; ఆయనే రక్షించుటకును నశింప జేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

13"నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా,"

14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

16ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్ఢది.

17కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును.

© 1970 Kitabı Mukaddes Şirketi
iv>