1''మీరు అభ్యంతరపకుండవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను.
2వారు మిమ్మును సమాజమందిరములో నుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొనుకాలము వచ్చుచున్నది.
3వారు తండ్రిని నన్నును తెలిసి కొనలేదు గనుక ఈలాగు చేయుదురు.
4అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.
5ఇప్పుడు నన్ను పంపినవానియొద్దకు వెళ్లుచున్నాను - నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని
6నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుః ఖముతో నిండియున్నది. సత్యస్వరూపియైన ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును
7"అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును."
8"ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును."
9"లోకులు నాయందు విశ్వాసముంచ లేదు గనుక పాపమును గూర్చియు,"
10"నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు"
11గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును.
12"నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు."
13"అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును."
14ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.
15"తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని."
16కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను
17"కాబట్టి ఆయన శిష్యులలో కొందరు - కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని యొకనితో ఒకరు చెప్పుకొనిరి."
18కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.
19"వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను - కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుచున్నారా?"
20మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
21స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె ఘడియవచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.
22"అటువలె మీరును ఇప్పుడు దుఃఖపుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును,మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. అడుగుడి, మీకు దొరకును"
23ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగురు; మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
24"ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును."
25"ఈ సంగతులు గూఢర్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక ఎన్నడును గూఢర్థముగా మీతో మాటలాడక, తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు ఘడియ వచ్చుచున్నది."
26ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని మేకొందునని మీతో చెప్పుటలేదు.
27"మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు."
28నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
29ఆయన శిష్యులు - ఇదిగో ఇప్పుడు నీవు గూఢర్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.
30"సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా,"
31యేసు వారిని చూచి - ''మీరిప్పుడు నమ్ముచున్నారా?
32"ఇదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు ఘడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను."
33"- నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.''"