1అట్లయితే యూదునికి కలిగిన గొప్ప తనమేమి? సున్నతి వలన ప్రజనమేమి?
2ప్రతి విషయమందును అధికమే. మొదటిది - దేవోక్తులు యూదుల పరము చేయబడెను.
3"కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు,"
4"నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము, ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు."
5మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను.
6"అట్లనరాదు, అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?"
7దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?
8మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.
9ఆలాగైన ఏమందుము? మేము వారి కంటె శ్రేష్టులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసియున్నాము.
10ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా -
11"నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు."
12"అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు."
13"వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది."
14వారి నోటి నిండ శపించుటయు పగయు ఉన్నవి.
15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
17శాంతి మార్గము వారెరుగరు.
18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
19"ప్రతినోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము."
20"ఏలయనగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. క్రీస్తునందలి విశ్వాసముద్వారా కలుగునీతి"
21ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
22"అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది."
23ఏ బేధమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.
24"కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తు యేసునందలి విమోచనముద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు."
25పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని
26"క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై యుండుటకు ఆయన ఆలాగు చేసెను."
27కాబట్టి అతిశయ కారణమెక్కడా? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు. విశ్వాస న్యాయమును బట్టియే.
28కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము.
29దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును. అన్యజనులకును దేవుడే.
30"దేవుడు ఒక్కడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును."
31విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.