1ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును పెద్దలతో కూడ
2"ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పమని ఆయననడిగిరి."
3"అందుకాయన- ''నేనును మిమ్మునొక మాట అడుగుదును అది నాతో చెప్పుడి,"
4"యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా? మనుష్యులనుండి కలిగినదా?'' అని వారి నడుగగా,"
5"వారు- మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన యెడల ఆలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని ఆయన మనలనడుగును,"
6"మనుష్యుల వలన కలిగినదని చెప్పిన యెడల ప్రజలందరు మనలను రాళ్ళతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త యని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని,"
7అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
8అందుకు యేసు - ''ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పను'' అని వారితోఅననెను.
9"అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను - ''ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి, కాపులకు గుత్త కిచ్చి దేశాంతరము పోయి బహు కాలముండెను."
10"పంట కాలమందు అతడు ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు తన దాసుని పంపగా, ఆ కాపులు అతనిని కొట్టి వట్టి చేతులతో పంపి వేసిరి"
11మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి.
12"మరలా అతడు మూడవ వానిని పంపగా, వారు వానిని గాయపరచి వెలుపలకు త్రోసివేసిరి."
13"అప్పుడు ద్రాక్షతోట యజమాని నేనేమి చేతును,? నా ప్రియ కుమారుని పంపెదను ఒక వేళ వారు అతనిని సన్మానించెదరనుకొనెను."
14"అయినను ఆ కాపులు అతని చూచి - ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకనితో నొకడు ఆలోచించుకొని,"
15అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమాని వారికేమి చేయును ?
16అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకిచ్చును'' అని ఆయన చెప్పగా వారు విని- అట్లు కాకపోవును గాకనిరి.
17ఆయన వారిని చూచి - ''ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి ?
18ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును'' అనెను.
19"ప్రధాన యాజకులును శాస్త్రులును తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ ఘడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి."
20.వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగులవారిని ఆయన యొద్దకు పంపిరి.
21". వారు వచ్చి - బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచు బోధించుచున్నావు; నీవెవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము."
22. మనము కైసరుకు పన్ను యిచ్చుట న్యాయమా? కాదా? అని ఆయన నడిగిరి.
23". ఆయన వారి కుయుక్తిని గురైరిగి, ''మీరు నన్నెందుకు శోధించుచున్నారు ?"
24". ఒక దేనారము నాకు చూపించుడి, దీని మీద రూపమును పై వ్రాతము ఎవనివి ?'' అని అడుగగా వారు కైసరువనిరి."
25. అందుకాయన- ''ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి'' అని వారితో చెప్పెను
26. వారు ప్రజల యెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
27పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లిగిరి.
28"బోధకుడా, భార్య బ్రతికి యుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన యెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను."
29ఏడుగురు సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను.
30రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లి చేసుకొనిరి.
31ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.
32కాబట్టి పునరుత్థానములో ఆమె వారిలో ఎవరికి భార్యగా నుండును ?
33ఆ ఏడుగురుకిని ఆమె భార్యగా నుండెను గదా అనిరి.
34"అందుకు యేసు- ''ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లి కియ్యబడుదురు గాని,"
35"పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడినవారు పెండ్లి చేసికొనరు, పెండ్లి కియ్యబడరు."
36వారు పునరుత్థానములో పాలివారై యుండి దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
37పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచూ మృతులు లేతురని మోషే సూచించెను.
38ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు గాదు; ఆయన దృష్టికి అందరును జీవించియున్నారు'' అని వారికి ఉత్తర మిచ్చెను.
39తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు
40"గనుక శాస్త్రులలో కొందరు - బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి."
41యేసు వారితో ''క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు?
42నేను నీ శత్రువులను నీ పాదములకు పాద పీఠముగా ఉంచువరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతోచెప్పెను.
43అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.
44దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఏలాగు అతని కుమారుడగును'' అని చెప్పెను.
45ప్రజలందరు వినుచుండగా ఆయన తన శిష్యులతో - ''శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు
46"సంతవీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు."
47వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయ వేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురు'' అని చెప్పెను.