1కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచెను.
2ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి-
3"''ఈ బీద విధవరాలు అందరి కంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను,"
4వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను'' అని వారితో చెప్పెను.
5"కొందరు - ఇది అందమైన రాళ్ళతోను అర్పితములతోను శృంగారింపబడి యున్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా,"
6"ఆయన- ''ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి'' అని చెప్పెను."
7"అప్పుడు వారు - ''బోధకుడా, ఆలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరుగ బోవునని సూచన ఏమి'' అని ఆయన నడుగగా,"
8"ఆయన- ''మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరటవచ్చి - నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి."
9మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగ వలసియున్నవి గాని అంతము వెంటనే రాదు'' అని చెప్పెను.
10మరియు ఆయన వారితో ఇట్లనెను - ''జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును;
11"అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరవులును తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును."
12"ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి, సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు."
13ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును.
14కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.
15మీ విరోధులందరు యెదురాడుటకును కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
16తల్లిదండ్రులచేతను సహోదరులచేతను బంధువుల చేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు.
17నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు.
18గాని మీ తలవెంట్రుకలలో ఒకటైనను నశింపదు.
19మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
20యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలుసుకొనుడి''
21''అప్పుడు యూదయలో నుండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్య నుండు వారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు.
22లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు.
23"ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమి మీద మిక్కిలి యిబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును."
24వారు కత్తి వాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును.
25"మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగ ముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును."
26"ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు యెదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు."
27అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
28"ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల లెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది'' అనెను."
29మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - ''అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి.
30అవి చిగురించుట చూచి వసంతకాల మప్పుడే సమీపమాయెనని మీయంతట మీరు తెలిసికొందురు గదా?
31అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.
32అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
33ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు.
34మీ హృదయములు ఒక వేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా నున్నందున ఆ దినము ఆకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా నుండుడి.
35ఆ దినము భూమియందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును.
36కాబట్టి మీరు జరుగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని యెదుట నిలువబడుటకు శక్తి గలవారగు నట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా నుండుడి'' అని చెప్పెను.
37"ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపడుచుండెను."
38ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.