1"తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతి గాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతి గాను, ఇతూరయత్రకోనీ దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి గాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతి గాను,"
2"అన్నయు కయపయు ప్రధానయాజకులుగాను, ఉన్న కాలమున అరణ్యములో నున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను"
3అంతట అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రాంతమందంతట ప్రకటించుచుండెను.
4"''అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము - ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి,"
5"ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్నవి అగును,"
6సకల శరీరులు దేవుని రక్షణ చూతురు.'' అని ప్రవక్తయైన యెషయా వాక్య గ్రంథములో వ్రాయబడినట్లు ఇది జరిగెను.
7"అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి - ''సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించు కొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు ?"
8"మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి, అబ్రాహాము మాకు తండ్రియని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింప గలడని మీతో చెప్పుచున్నాను."
9ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నుంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును'' అని చెప్పెను.
10"అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా,"
11"అతడు - రెండు అంగీలు వున్నవాడు ఏమియు లేని వానికియ్య వలెననియు, ఆహారము గలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను."
12"సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి - ''బోధకుడా, మేమేమి చేయవలయున''ని ఆయన నడుగగా,"
13ఆయన - ''మీకు నిర్ణయింపబడిన దానికంటె ఎక్కువ తీసుకొనవద్దు'' అని వారితో చెప్పెను.
14"సైనికులును - ''మేమేమి చేయవలెను'' అని అతని నడిగిరి. అందుకతడు - ''ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది యుండుడు'' అని వారితో చెప్పెను."
15"ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా,"
16యోహాను - ''నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును
17"ఆయన చేట ఆయన చేతిలో నున్నది; ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయును'' అని అందరితో చెప్పెను."
18ఇదియును గాక అతడింకను చాలా సంగతులను చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను.
19"అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు"
20అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
21"ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి,"
22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు ''నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేనానందించుచున్నాను'' అని ఒక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
23"యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది యేండ్ల యీడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి,"
24"హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,"
25"మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,"
26"నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,"
27"యోదా యొహన్నకు, యొహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు నేరికి,"
28"నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు,"
29"ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,"
30"లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు,"
31"ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,"
32"దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,"
33"నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,"
34"యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,"
35"నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,"
36"షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేమునకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,"
37"లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు మహలలేలు కేయినానుకు,"
38"కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు."