1 కొరింథీయులకు 6:1-20 TBO1970 - Bible AI

1"మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యెమున్నప్పుడు, వాడు పరిశుద్ధుల యెదుట గాక అనీతిమంతుల యెదుట వ్యాజ్యేమాడుటకు తెగించుచున్నాడా?"

2"పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?"

3మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా లోకమునకు తీర్పు తీర్చవచ్చును గదా?

4"కాబట్టి, ఈ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండ బెట్టుదురా?"

5మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?

6అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యె మాడుచున్నాడు. మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడుచున్నాడు.

7ఒకని మీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో యిప్పటికే కేవలము లోపము. అంత కంటె అన్యాయము సహించుట మేలు కాదా? దాని కంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?

8"అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు. మీ సహోదరులకే ఈలాగు చేయుచున్నారు."

9"అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను,"

10"దొంగలైనను, లోభులైనను త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు."

11"మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధ పరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అపవిత్రమైన క్రైస్తవ జీవితము"

12అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని నేను దేనిచేతను లోపరచుకొనబడ నొల్లను.

13"భోజన పదార్ధములు కడుపునకును, కడుపు భోజన పదార్ధములకును నియమింప బడియున్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే."

14దేవుడు ప్రభువును లేపెను. మనలను కూడ తన శక్తి వలనలేపును.

15"మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని, వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు."

16వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏక దేహమైయున్నాడని మీరెరుగరా? - వారిద్దరు ఏకశరీరమైయుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

18"జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు."

19"మీ దేహము దేవుని వలన మీ కనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,"

20విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

icle>