1 దినవృత్తాంతములు 1:1-54 TBO1970 - Bible AI

1ఆదాము షేతు ఎనోషు

2కేయినాను మహలలేలు యెరెదు

3హనోకు మెతూషెల లెమెకు

4నోవహు షేము హాము యాపెతు.

5యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

6గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

7యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

8హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

9కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

10"కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు."

11లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

13కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

14యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

15హివ్వీయులు అర్కీయులు సీనీయులు

16అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

19"ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను."

20యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

21హదోరమును ఊజాలును దిక్లానును

22ఏబాలును అబీమా యేలును షేబను

23"ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు."

24షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

25సెరూగు నాహోరు తెరహు

26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

27"అబ్రాహాము కుమారులు,"

28ఇస్సాకు ఇష్మాయేలు.

29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

30మిష్మా దూమా మశ్శా హదదు తేమా

31యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

32అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

33"మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు."

34"అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు."

35ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

36ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

37రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

38శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

39లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

40శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

41అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

42ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

43ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

44బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

45యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

47హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

50బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.

51"హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,"

52"అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,"

53"కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,"

54"మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు."

article>