2 యోహాను 1:1-13 TBO1970 - Bible AI

1"పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది-"

2"నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించు చున్నాము."

3"సత్య ప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్ద నుండియు, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును."

4తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.

5"కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్లు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను."

6మన మాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.

7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.

8అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చె గొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

9క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు; ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.

10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

11శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.

12అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులోక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.

13ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.

© 1970 Kitabı Mukaddes Şirketi
/div>